TET GURUAP TET • DSC • TEACHER EXAMS
Home / Paper IA / CDP Study Material / Introduction to Psychology / Psychosocial Developmental stages

Psychosocial Developmental stages

ADVERTISEMENT — TOP OF UNIT / RESPONSIVE AD
TET Guru • Bilingual Study MaterialBack to Introduction to Psychology →

Psychosocial Developmental stages

APTET / DSC CDP — Child Development

శిశు దశ నుంచి వృద్ధాప్యం వరకు వికాస దశలు మరియు ఎరిక్సన్ మనోసాంఘిక వికాస దశల (Trust vs Mistrust నుండి Integrity vs Despair వరకు) పూర్తి పట్టిక.

పిల్లల మానసిక వికాసాన్ని అర్థం చేసుకోవడానికి హావిఘర్స్ట్ (Hurlock) సూచించిన వయో దశలు మరియు ఎరిక్సన్ సూచించిన మనోసాంఘిక వికాస దశలు (Psychosocial stages) — రెండూ APTET CDP పరీక్షలో అత్యంత ముఖ్యమైన టాపిక్‌లు.
Advertisement

1హావిఘర్స్ట్ వికాస దశలుHurlock’s Developmental Stages

ఎలిజిబెత్ హార్లాక్ వికాస దశలుElizabeth Hurlock’s Stages of Development
దశవయస్సుముఖ్యాంశాలు
1. జనన పూర్వదశఫలదీకరణం నుంచి పుట్టుక వరకు
2. నవజాత శిశువు
(Infancy)
పుట్టుక నుంచి రెండవ వారం చివరి వరకుజనన పూర్వ పరిసరాలకు, జననానంతర పరిసరాలకు మధ్య ఏర్పడిన పరిస్థితులలో సర్దుబాట్లు చేసుకుంటుంది.
3. శైశవదశ
(Boy hood)
రెండవ వారం చివరి నుంచి రెండు సంవత్సరాల చివరి వరకుపెరుగుదల అత్యంత వేగంగా జరుగుతుంది. జ్ఞానేంద్రియ వికాసం ఎక్కువ. ఏకాంత క్రీడా దశ.
4. పూర్వ బాల్యదశ
(Early childhood)
2 నుంచి 6 సంవత్సరాల వరకుఇది అన్వేషించే వయస్సు. దీనినే పాఠశాల పూర్వదశ అంటారు. సాంఘిక వికాసానికి తొలి మెట్టు అయిన ఆత్మభావన ప్రారంభమయ్యేదశ. ఈ దశను ప్రమాద వయస్సు అని కూడా అంటారు. వాగుడు కాయ దశ అని, పూర్వముఠా దశ అని అంటారు.
5. ఉత్తర బాల్యదశ
(Late childhood)
6 నుంచి 10 లేదా 12 సంవత్సరాల వరకుఇది పాఠశాల దశ. పెరుగుదల వేగం మందగిస్తుంది. సాంఘిక వికాసం ఎక్కువవుతుంది. వివిధ రకాలైన కౌశలాల వికాసం జరుగుతుంది. ఈ దశను ముఠా దశ అని పిలువబడుతుంది.
6. యవ్వనారంభదశ
(Puberty)
10 లేదా 12 నుంచి 13 లేదా 14 సంవత్సరాల వరకుద్వితీయ లైంగిక లక్షణాలు అంకురిస్తాయి.
7. కౌమారదశ
(Adolescence)
13 లేదా 14 నుంచి 18 సంవత్సరాల మధ్యదీనినే ‘టీనేజ్’ (Teen age – Thirteen to Seventeen years మధ్య) అంటారు. భిన్న లైంగిక వర్గ వ్యక్తులను గురించి ఆలోచిస్తారు. ఇది వత్తిడి వయస్సు (Age of stress and strain). అస్థిరమైన దశ.
8. పూర్వ వయోజనదశ
(Early Adult hood)
18 నుంచి 40 సంవత్సరాలుసామర్థ్యాలు పరిపూర్ణత పొందుతాయి. శారీరక, మానసిక కాసం నిలిచిపోతుంది.
9. మధ్య వయస్సు
(Middle age)
40 నుంచి 60 సంవత్సరాలుఇది సర్దుబాటు దశ. పునరుత్పాదక శక్తి తగ్గిపోతుంది.
10. వృద్ధాప్యం
(old age)
60 నుంచి మరణం వరకునిష్క్రమణ వయస్సు. కొంతమంది వృద్ధుల్లో మెదడు పనిచేయడం నిలిచిపోయి సెనైలిటీ (Senility) కి దారి తీస్తుంది.

2ఎరిక్సన్ మనోసాంఘిక దశలుErikson’s Psychosocial Stages

ఎరిక్సన్ మనోసాంఘిక వికాస దశలు (8 దశలు)Erikson’s 8 Stages of Psychosocial Development
దశవయోపరిమితిమనోసాంఘిక క్లిష్ట పరిస్థితులుగుణం / లక్షణం
1. పూర్వ శైశవం
(Infancy)
మొదటి సం॥నమ్మకం Vs అపనమ్మకం
(Trust Vs mistrust)
ఆశ
2. ఉత్తర శైశవం
(Baby hood)
1–3 సం॥స్వయం ప్రతిపత్తి Vs సిగ్గు, సంశయం
(Autonomy Vs shame and doubt)
తలంపు
3. క్రీడాదశ
(Play age)
3–5 సం॥చొరవ చూపడం Vs అపరాధ భావన
(Initiative Vs guilty)
ప్రయోజనం
4. పాఠశాల దశ
(School age)
6–12 సం॥శ్రమించడం Vs న్యూనత
(Industry Vs inferiority)
సామర్థ్యం
5. కౌమారం
(Adolescence)
12–20 సం॥పాత్ర గుర్తింపు Vs పాత్ర సందిగ్ధం
(Role identity Vs role confusion)
విశ్వసనీయత
6. పూర్వ వయోజన దశ
(Young Adult hood)
20–30 సం॥సన్నిహితం Vs ఏకాంతం
(Intimacy Vs Isolation)
ప్రేమ
7. మధ్య వయోజన దశ
(Middle Adult hood)
30–60 సం॥ఉత్పాదకత Vs స్తబ్ధత
(Generativity Vs stagnation)
సంరక్షణ
8. పరిపక్వ దశ
(Maturity stage)
60 పైనసమర్థత / సమగ్రత Vs నిరాశ
(Integrity Vs despair)
సూక్ష్మబుద్ధి
Advertisement

APTET CDP · Related Study Material

ADVERTISEMENT — MID / IN-ARTICLE AD
ADVERTISEMENT — AFTER UNIT / RESPONSIVE AD