TET GURUAP TET • DSC • TEACHER EXAMS
Home / Paper IA / CDP Study Material / Introduction to Psychology / Psychology Personality Theories మూర్తిమత్వ సిద్ధాంతాలు

Psychology Personality Theories మూర్తిమత్వ సిద్ధాంతాలు

ADVERTISEMENT — TOP OF UNIT / RESPONSIVE AD
TET Guru • Bilingual Study MaterialBack to Introduction to Psychology →

Psychology Personality Theories మూర్తిమత్వ సిద్ధాంతాలు. Personality theories in psychology explore how personality develops and affects behavior. These theories include perspectives like biological, behavioral, psychodynamic, humanistic, and trait approaches. Understanding these theories enhances self-awareness and insight into personal growth and behavior.

APTET / DSC CDP — Personality

హిప్పోక్రటీస్, క్రెష్మర్, షెల్డన్, స్ప్రాంగర్, ఆల్‌పోర్ట్, ఫ్రాయిడ్ మూర్తిమత్వ సిద్ధాంతాలు — ఒకే పేజీలో పూర్తి వివరణతో.

Psychology Personality Theories మూర్తిమత్వ సిద్ధాంతాలు. Personality theories in psychology explore how personality develops and affects behavior. These theories include perspectives like biological, behavioral, psychodynamic, humanistic, and trait approaches. Understanding these theories enhances self-awareness and insight into personal growth and behavior.

మూర్తిమత్వం (Personality) ను వివరించే రూప సిద్ధాంతాలు, లక్షణాంశ సిద్ధాంతాలు మరియు నిర్మితి సిద్ధాంతాలు — హిప్పోక్రటీస్ నాలుగు చిత్తవృత్తుల నుంచి ఫ్రాయిడ్ మనోలైంగిక దశల వరకు అన్నీ ఇక్కడ.
Advertisement

1మూర్తిమత్వ సిద్ధాంతాల చిత్రపటం Overview — Type, Trait & Developmental Theories

  • మూర్తిమత్వ సిద్ధాంతాలు (Personality Theories)
    • రూప సిద్ధాంతాలు (Type theories)
      • హిప్పోక్రటీస్ వర్గీకరణ — ఔత్సాహికులు, పైత్య ప్రవృత్తిగలవారు, శ్లేష్మ ప్రవృత్తిగలవారు, విషణ్ణులు
      • స్పెల్లన్ వర్గీకరణ → స్థూలకాయులు / మధ్యమకాయులు / లంబకృతకాయులు → బహిర్వర్తనులు & అంతర్వర్తనులు
      • క్రెష్మర్ వర్గీకరణ → పీవరకాయులు, క్రీడాకాయులు, ప్రాంశుకాయులు
      • యుంగ్ వర్గీకరణ → బహిర్వర్తనులు & అంతర్వర్తనులు
    • లక్షణాంశ సిద్ధాంతాలు (Trait theories)
      • ఆల్‌పోర్ట్ సిద్ధాంతం
      • కేటిల్ సిద్ధాంతం
    • నిర్మితి సిద్ధాంతాలు (Developmental theories)
      • ఫ్రాయిడ్ సిద్ధాంతం (మనోలైంగిక వికాసం)
      • ఎరిక్సన్ సిద్ధాంతం (మనోసాంఘిక వికాసం)
    • స్ప్రాంగర్ వర్గీకరణ (విలువల ఆధారంగా)
      • సైద్ధాంతిక, ఆర్థిక, సాంఘిక, రాజకీయ, మత, సౌందర్యారాధన విలువలు కలవారు

2హిప్పోక్రటీస్ వర్గీకరణ Hippocrates — 4 Temperaments

1. హిప్పోక్రటీస్ వర్గీకరణ (నాలుగు మూర్తిమత్వ చిత్తవృత్తులు)Hippocrates’ Classification — 4 Temperaments
రకంలక్షణం
1. ఔత్సాహికులు (Sanguine)రక్తం అధికంగా ఉంటుంది. ఆశావాదులు, సంతోషంగా ఉంటారు. సర్దుబాటు ఎక్కువ. ప్రతి విషయాన్ని తేలికగా తీసుకుంటారు. ఉద్వేగపరంగా, శారీరకంగా బలంగా ఉంటారు.
2. పైత్య ప్రవృత్తి కలవారు (Choleric)పసుపుపచ్చని పైత్యరసం కలవారు. కోపశీలురు. చిరాకు స్వభావం కలిగి ఉంటారు. శారీరకంగా ఉద్వేగపరంగా బలహీనులు.
3. శ్లేష్మ ప్రవృత్తి గలవారు (Phlegmatic)అధికంగా శ్లేష్మం గలవారు. నెమ్మదిగా, నిదానంగా, సోమరిగా ఉంటారు. శారీరకంగా ఉద్వేగాత్మకంగా బలహీనులుగా ఉంటారు.
4. విషణ్ణులు (Melancholic)నల్లని పైత్యరసం అధికంగా ఉండేవారు. నల్లని పైత్యరసం భావన హిప్పోక్రటీస్ ఊహాత్మకంగా స్వీకరించింది. విచారంగా, మందకొడిగా, నిరాశావాదులుగా ఉంటారు. శారీరకంగా, ఉద్వేగపరంగా బలహీనులుగా ఉంటారు.

3క్రెష్మర్ వర్గీకరణ Kretschmer’s Body Types

2. క్రెష్మర్ వర్గీకరణ — శరీర నిర్మాణాన్ని బట్టి (జర్మన్ వైద్యుడు)Kretschmer’s Body-Type Classification
రకంలక్షణం
1. పీవరకాయులు (Pyknic)లావుగా, ఉల్లాసంగా, కలుపుగోలుగా బహిర్వర్తనులుగా, ప్రతి విషయాన్ని తేలికగా తీసుకుంటారు.
2. క్రీడాకాయులు (Athletic)కండపుష్టి కలిగి, ఆశావాదులుగా, సర్దుబాటు కలిగి ఉంటారు.
3. ప్రాంశుకాయులు (Leptosomatic / Asthetic)సన్నగా, బలహీనంగా, సిగ్గుపడుతూ అంతర్వర్తనులుగా, నిరాశావాదులుగా ఉంటారు.

4షెల్డన్ వర్గీకరణ Sheldon’s Somatotypes

3. డబ్ల్యూ.హెచ్. షెల్డన్ వర్గీకరణ — శరీరాకృతిని బట్టిW.H. Sheldon’s Somatotype Classification
రకంలక్షణం
1. స్థూలకాయులు (Endomorphic)లావుగా, క్రొవ్వు కలిగి ఉంటారు. కలుపుగోలుగా, ఆశావాదిగా, సాంఘిక పరిపక్వత కలవారుగా, బహిర్వర్తనులుగా ఉంటారు. ప్రతి అంశాన్ని తేలికగా తీసుకుంటారు.
2. మధ్యమకాయులు (Mesomorphic)బలిష్టంగా, కండపుష్టి కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. సాహసాలు చేయడానికి ఇష్టపడతారు.
3. లంబకృతకాయులు (Ectomorphic)సన్నగా, బలహీనంగా ఉంటారు. నిరాశావాదులు. సున్నితమైన మనస్సు కలవారు. ముభావంగా, అంతర్వర్తనులుగా ఉంటారు.

5స్ప్రాంగర్ వర్గీకరణ Spranger’s Value-Based Types

4. స్ప్రాంగర్ వర్గీకరణ — వ్యక్తుల జీవితంలో ఇచ్చే విలువల ఆధారంగా (6 రకాలు)Spranger’s Classification — Based on Values (6 Types)
రకంలక్షణంఉదాహరణ
1. సైద్ధాంతిక (Theoretical) విలువలు కలవారుఆదర్శాలకు విలువ ఇవ్వడం, నిర్దుష్ట మేధావుల పద్ధతిలో జీవితం గడపడం.డా॥ అబ్దుల్ కలామ్, శాస్త్రవేత్తలు
2. ఆర్థిక (Economical) విలువలు కలవారుఆర్థిక సంబంధాలకు ప్రాధాన్యతనివ్వడం.వాణిజ్య, వ్యాపారవేత్తలు — ఉదా: బిల్ గేట్స్
3. సాంఘిక (Social) విలువలు గలవారుఇతరుల కోసం జీవించేవారు.సంఘ సేవకులు, పరోపకారులు — ఉదా: మహాత్మాగాంధీ, మదర్ థెరిస్సా
4. రాజకీయ (Political) విలువలు గలవారురాజకీయ ప్రాబల్యం కోసం ప్రయత్నించేవారు.రాజకీయ నాయకులు
5. మత (Religion) విలువలు గలవారుమత విషయాలపై ఆసక్తితో, మత సిద్ధాంతాల ప్రకారం జీవితం గడిపేవారు.మత పెద్దలు, ఆధ్యాత్మికవేత్తలు
6. సౌందర్య ఆరాధన (Aesthetic) విలువలు గలవారుకళారాధన కలిగినవారు.కళాకారులు

6ఆల్‌పోర్ట్ లక్షణాంశ సిద్ధాంతం Allport’s Trait Theory

5. ఆల్‌పోర్ట్ లక్షణాంశ సిద్ధాంతం (Trait Theory)Allport’s Trait Theory — 3 Kinds of Traits
రకంవివరణఉదాహరణ
1. ప్రాథమిక లక్షణాంశాలు
(Cardinal traits)
ప్రతివ్యక్తిలో ఏదో ఒక రూపంలో ఉంటాయి.దయ, ఉదారత, స్నేహం
2. కేంద్ర లక్షణాంశాలు
(Central traits)
వ్యక్తికే ప్రత్యేకమైన కొన్ని లక్షణాలు.ప్రత్యేక సందర్భాల్లో వ్యక్తమవుతాయి
3. మాధ్యమిక లక్షణాంశాలు
(Secondary traits)
పరిమితంగా వ్యక్తమవుతాయి.అంత ముఖ్యమైనవి కావు

7ఫ్రాయిడ్ మనోలైంగిక దశలు Freud’s Psychosexual Stages

6. ఫ్రాయిడ్ మనోలైంగిక వికాస దశలు (Psychosexual Development)Freud’s Psychosexual Stages of Development
దశవయస్సుముఖ్యాంశాలు
1. మౌఖిక దశ (Oral Stage)0–1 సం॥నోటిద్వారా ఆనందం
2. ఆసన దశ (Anal Stage)02–03 సం॥మల విసర్జన ద్వారా ఆనందం
3. శిశ్న దశ (Phallic stage)04–05 సం॥ఈడిపస్, ఎలక్ట్రా కాంప్లెక్స్‌లు
4. గుప్త దశ (Latency stage)6–11 సం॥తాదాత్మీకరణం
5. జననాంగదశ (Genital stage)11/12 సం॥ నుండిభిన్న లైంగికాసక్తి
Advertisement

APTET CDP · Related Study Material

ADVERTISEMENT — MID / IN-ARTICLE AD
ADVERTISEMENT — AFTER UNIT / RESPONSIVE AD