TET GURUAP TET • DSC • TEACHER EXAMS
Home / Paper IA / CDP Study Material / Introduction to Psychology / Sigmund Freud Defense Mechanisms

Sigmund Freud Defense Mechanisms

ADVERTISEMENT — TOP OF UNIT / RESPONSIVE AD
TET Guru • Bilingual Study MaterialBack to Introduction to Psychology →

Sigmund Freud Defense Mechanisms. A Defense mechanism is an unconscious psychological strategy that the mind uses to protect a person from anxiety, difficult emotions, or stressful truths

APTET / DSC CDP — Psychology

A Defense mechanism is an unconscious psychological strategy that the mind uses to protect a person from anxiety, difficult emotions, or stressful truths. First introduced in psychoanalytic theory by Sigmund Freud and expanded by Anna Freud, these tools distort or manipulate reality to help people cope with inner conflict

దమనం (Repression) నుంచి వ్యక్తీకరణం (Action out) వరకు — 15 రక్షక తంత్రాలు, వాటి వివరణ మరియు రోజువారీ జీవితంలో ఉదాహరణలతో సహా.

ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతం ఆధారంగా వివరించిన 15 రక్షక తంత్రాలు (Defense Mechanisms) — APTET CDP పరీక్షలో ఉదాహరణలతో సహా అడిగే అత్యంత ముఖ్యమైన టాపిక్.
Advertisement

1రక్షక తంత్రాలు — పూర్తి పట్టికAll 15 Defense Mechanisms with Examples

మనోవిజ్ఞానంలో రక్షక తంత్రాలు (15 రకాలు)15 Defense Mechanisms — Description & Examples
రక్షక తంత్రంవివరణఉదాహరణ
1. దమనం
(Repression)
బాధాకరమైన ఉద్దీపనలను ప్రయత్నపూర్వకంగా మరిచిపోయే ప్రయత్నం చేయడం. ఇలా మరిచిపోయిన అంశాలు పూర్తిగా విస్మృతి కాకుండా అచేతనావస్థలో నిలిచి ఉంటాయి. కోరికలను ఎక్కువగా దమనం చేసే మానసిక రుగ్మతలు కలుగుతాయి.1. బాధాకరమైన సంఘటనలను, అవమానాలను మరిచిపోవడం
2. ప్రమాదాలలో మరణాలను, ఆప్తుల మరణాలను మరిచిపోవడం
2. ప్రతిగమనం
(Regression)
మానసిక తన్యతలను తగ్గించుకోవడానికి వ్యక్తులు అంతకు ముందటి వయో దశలోని వారిలాగా ప్రవర్తించడం.1. అత్తవారింట్లో ఇబ్బందులుపడ్డ కోడలు తల్లి గారింట్లో చిన్న పిల్లలా ఏడ్వడం
2. ఎవరైనా ఆప్తులు మరణించినపుడు, అమూల్యమైన, అతి ఇష్టమైన వస్తువులను కోల్పోయినపుడు పెద్దలు కూడా చిన్న పిల్లల్లా వెక్కివెక్కి ఏడ్వడం
3. పరిహారం
(Compensation)
ఒక రంగంలో రాణించలేని వ్యక్తి మరో రంగంలో రాణించడం.1. చదువులో రాణించని వ్యక్తి ఆటపాటలలో రాణించడం
2. ప్రేమలో విఫలమైన వ్యక్తి విరహగీతాలను రాయడం
3. పిల్లలు కలుగని వ్యక్తి చిన్న పిల్లల పాఠశాలలో మెరుగైన బోధన చేయడం
4. హేతుబద్ధీకరణ / హేతుకీకరణ
(Rationalisation)
సమర్థనీయం కాని అంశాలను కూడా సమర్థించుకోవడం. వ్యక్తి తన లోపాలను, తప్పులను అవహేళన చేయడం.1. పని ఎందుకు సరిగా చేయలేదంటే ‘సరైన సమయం లేకపోవడం వల్ల’ అని చెప్పడం
2. అందని ద్రాక్షపళ్ళు పులన అనడం
3. పరీక్షలో కాపీ ఎందుకు చేశావంటే అందరూ అలాగే చేస్తారని చెప్పడం
4. డిప్సనీసిలో ఎందుకు ఉద్యోగం రాలేదంటే ‘ఉపాధ్యాయ వృత్తి కూడా ఒక వృత్తేనని’ అనడం
5. ప్రక్షేపణం
(Projection)
వ్యక్తి తన లోపాలను, తప్పులను ఇతరులకు ఆపాదించడం. తప్పులకు, లోపాలకు ఇతరులను కారణంగా చూపడం.1. పరీక్ష తప్పిన విద్యార్థి దానికి ఉపాధ్యాయుడే కారణమని తెలపడం
2. అదృష్టం బాగా లేకపోవడం వల్ల వ్యాపారంలో నష్టం వచ్చిందని చెప్పడం
6. విస్థాపనం
(Displacement)
వ్యక్తి తన కోపాన్ని, కుంఠనాన్ని తక్కువ శక్తిగల వ్యక్తులపై, వస్తువులపై చూపడం. ‘అత్తమీద కోపం దుత్తమీద చూపడం’ లాంటిది ఇది.1. ఆఫీసులో తిట్టు తిన్న గుమాస్తా ఇంట్లో భార్యపై కోపాన్ని ప్రదర్శించడం
2. పరీక్ష సరిగా రాయనందు వల్ల పెన్నును విరగగొట్టడం
3. భర్త/అత్త మందలిస్తే ఆ కోపాన్ని పిల్లలపై ప్రదర్శించడం
7. తాదాత్మీకరణం
(Identification)
తను సాధించలేని పనిని ఇతరులు సాధిస్తే ఇతరులలో తనను తాను పోల్చుకోవడం.1. ఇండియన్ టీమో, సినీ హీరోలతో తమను తాము పోల్చుకొని వారి విజయాలకు, పరాజయాలకు అనుకూల, ప్రతికూలంగా ప్రతిస్పందించడం
2. తను కలెక్టర్ కాకపోయినా కొడుకు కలెక్టర్ అయిన తన కొడుకును చూసి గర్వించడం
8. స్వైర కల్పనం
(Fantasy)
పగటి కలలు కనడం.1. డిప్సనీసిలో ఉద్యోగం రాని వ్యక్తి డిజాక్ మారి అందరికీ అపాయింట్‌మెంట్ ఇచ్చినట్లుగా పగటి కలలు కనడం
9. ఉపసంహరణ
(Withdrawal)
వ్యాకులత కలిగించే సంఘటనల నుంచి తప్పించుకోవడం.1. పరీక్షకు సరిగా సన్నద్ధంకాని వ్యక్తి పరీక్ష రాయకపోవడం
2. అప్పు తీర్చలేని వ్యక్తి అప్పు ఇచ్చిన వ్యక్తికి కనిపించకుండా తప్పించుకోవడం
3. ఆటలలో రాణించలేని వ్యక్తి ఆటలలో ఆసక్తిలేదని తెలపడం
10. సానుభూతి
(Sympathy)
ఇతరుల సానుభూతితో ఊరట చెందడం.1. ఇతరుల ఓదార్పును ఆశించడం
11. ప్రతిచర్యా నిర్మితి
(Reaction formation)
వ్యక్తి తన అసలైన వాంఛలకు, కోరికలకు భిన్నంగా ఉండే అంశాలను వ్యక్తం చేయడం.1. డబ్బులు ఖర్చు చేయడం ఇష్టం లేని వ్యక్తి ఎక్కువ మొత్తంలో దానం చేయలేని, చేస్తే కోటి రూపాయలు దానం చేస్తానని — చిల్లర మల్లర దానాలను చేయడని, ఉంటుందని పేర్కొనడం, దీని ద్వారా ప్రస్తుతానికి దానం చేసే పరిస్థితి నుంచి తప్పించుకోవడం
2. ఒక వ్యక్తిని గురించి దురభిప్రాయం ఉన్నా, అతడు మంచివాడని పేర్కొనడం
12. నిరాకరణం
(Denial of reality)
అంగీకరించడానికి ఇష్టంలేని అంశాలను తిరస్కరించడం.1. ఇష్టంలేని దృశ్యాలను చూడకపోవడం
2. తట్టుకోలేని, భయంకరమైన విషయాలు ఎదురుపడ్డప్పుడు స్పృహ తప్పడం
13. బౌద్ధీకరణం
(Intellectualization)
బాధ, భయాన్ని కలిగించే అనుభూతుల నుంచి మేధోపరమైన కారణాలను తెలుపుతూ తప్పించుకోవడం.1. కావలసిన వ్యక్తి మరణిస్తే — ‘ఆయసం లేకుండా లేకుండా సుఖంగా మరణించాడని’ పేర్కొనడం
14. ప్రాయశ్చిత్తం
(Undoing)
తన మనసులోని అంగీకరించతగని ఆలోచనలకు బహిరంగంగా క్షమాపణ అడగడం.1. తప్పులు చేసిన వ్యక్తి ఉదారంగా దానాలు చేయడం
2. వృత్తిమీద ఆసక్తిలేని ఉపాధ్యాయులు ఉపాధ్యాయ వృత్తిని గురించి ఉపన్యాసాలివ్వడం
15. వ్యక్తీకరణం
(Action out)
వత్తిడిని కలిగించే అంశాలను బయటకు వ్యక్తం చేయడం.1. తల్లిదండ్రుల ఆంక్షలు ఎక్కువ అయినపుడు ఎదురు తిరగడం
Advertisement

APTET CDP · Related Study Material

ADVERTISEMENT — MID / IN-ARTICLE AD
ADVERTISEMENT — AFTER UNIT / RESPONSIVE AD