Transfer of Learning – Learning Theories . Transfer of learning is when knowledge, skills, or habits learned in one place or task help or hurt a person in a new task. Psychologists use different theories to explain how this happens, including the theory of identical elements, generalization theory, and Gestalt insight theory.
APTET / DSC CDP — Learning
పొగడ్త-నింద, గ్రేడింగ్, బహుమానం-దండన, కాంక్షాస్థాయి సిద్ధాంతాలు మరియు అనుకూల, వ్యతిరేక, శూన్య, ద్విపార్శ్వ బదలాయింపు రకాలు.
Transfer of learning is when knowledge, skills, or habits learned in one place or task help or hurt a person in a new task. Psychologists use different theories to explain how this happens, including the theory of identical elements, generalization theory, and Gestalt insight theory
1అభ్యసనాన్ని మెరుగుపరిచే సిద్ధాంతాలు Theories on Improving Learning
| కారకము | సిద్ధాంతకర్త | ముఖ్యాంశాలు |
|---|---|---|
| 1. పొగడ్త – నింద | ఎలిజిబెత్ హార్లాక్ | పొగడ్త, నిందలు రెండూ అభ్యసనను మెరుగుపరిచే కారకాలే అయినప్పటికీ దీర్ఘకాలికంగా పొగడ్త మెరుగైనది. |
| 2. గ్రేడ్ పద్ధతి | ఎల్లిన్ పేజ్ | గ్రేడింగ్ అభ్యసనను మెరుగు పరుస్తుంది. |
| 3. బహుమానం – దండన (Reward and Punishment) | థార్న్డైక్ | దండనను విద్యార్థి ప్రవేశ ప్రవర్తనలో ఇవ్వడం సముచితం. దండనతో బాటు బహుమానాలను కలిపితే అభ్యసనం మెరుగుపడుతుంది. |
| 4. సాఫల్యము Vs వైఫల్యము | — | సాఫల్యము అభ్యసన ప్రేరకము. కొన్ని సందర్భాలలో ఈ ప్రేరణను వైఫల్యం కూడా కలిగిస్తుంది. ‘Every failure is a stepping stone for success’ అనేది ఇందుకే! |
| 5. కాంక్షాస్థాయి (Level of aspiration) | — | కాంక్షాస్థాయి విద్యార్థి అభ్యసనపై ప్రభావాన్ని చూపిస్తుంది. |
2అభ్యసన బదలాయింపు రకాలు Types of Transfer of Learning
| బదలాయింపు రకం | వివరణ | ఉదాహరణ |
|---|---|---|
| 1. అనుకూల బదలాయింపు (Positive Transfer) | ఒక విషయాన్ని నేర్చుకున్నప్పుడు అర్జించిన పరిజ్ఞానం మరో విషయాన్ని నేర్చుకోవడానికి ఉపకరించడం. | 1. హార్మోని నేర్చుకోవడం ‘పియానో’ నేర్చుకోవడానికి ఉపకరించడం |
| 2. వ్యతిరేక బదలాయింపు (Negative Transfer) | ఒక విషయాన్ని నేర్చుకున్న పరిజ్ఞానం మరో విషయాన్ని నేర్చుకోవడానికి అవరోధాన్ని కల్పించడం. | 1. పిట్మన్ పద్ధతిలో షార్ట్హాండ్ నేర్చుకున్న వ్యక్తి దాంటన్ పద్ధతిలో నేర్చుకోవడం 2. కారు నడిపే వ్యక్తి విమానాన్ని నడపడం |
| 3. శూన్య బదలాయింపు (Zero Transfer) | ఒక విషయాన్ని నేర్చుకోవడంలో సంపాదించిన నైపుణ్యాలు మరో అంశంలో ఏమాత్రం ప్రభావాన్ని చూపించకపోవడం. | 1. సంస్కృత పరిజ్ఞానం గణితం నేర్చుకోవడానికి ఉపకరించకపోవడం |
| 4. ద్విపార్శ్వ బదలాయింపు (Bilateral Transfer) | ఒక నైపుణ్యం రెండు రకాల అభ్యసనాలకీ దోహదం చేయడం. | 1. చేతి వ్రాత కుడి చేతితో నేర్చుకుంటే ఎడమ చేతితో కూడా రాయగలగడం |
APTET CDP · Related Study Material
- మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు & పారిభాషిక పదాలు — Psychology Pioneers & Terminology
- మనోవిజ్ఞాన శాస్త్ర సంప్రదాయాలు — Schools of Psychology
- వికాస దశలు — హావిఘర్స్ట్ & ఎరిక్సన్ — Developmental Stages — Havighurst & Erikson
- విద్యా మనోవిజ్ఞాన పరిశోధన పద్ధతులు — Research Methods in Educational Psychology
- మూర్తిమత్వ సిద్ధాంతాలు & వర్గీకరణలు — Personality Theories & Classification
- మూర్తిమత్వ అంచనా విధానాలు — Personality Assessment Techniques
- రక్షక తంత్రాలు (Defense Mechanisms) — Defense Mechanisms in Psychology
- సంఘర్షణ రకాలు — Types of Conflict in Psychology
- ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణ & ప్రజ్ఞా పరీక్షలు — Intelligence Classification & IQ Tests