TET Guru • Bilingual Study MaterialBack to Introduction to Psychology →
Psychosocial Developmental stages
APTET / DSC CDP — Child Development
శిశు దశ నుంచి వృద్ధాప్యం వరకు వికాస దశలు మరియు ఎరిక్సన్ మనోసాంఘిక వికాస దశల (Trust vs Mistrust నుండి Integrity vs Despair వరకు) పూర్తి పట్టిక.
పిల్లల మానసిక వికాసాన్ని అర్థం చేసుకోవడానికి హావిఘర్స్ట్ (Hurlock) సూచించిన వయో దశలు మరియు ఎరిక్సన్ సూచించిన మనోసాంఘిక వికాస దశలు (Psychosocial stages) — రెండూ APTET CDP పరీక్షలో అత్యంత ముఖ్యమైన టాపిక్లు.
Advertisement
1హావిఘర్స్ట్ వికాస దశలుHurlock’s Developmental Stages
| దశ | వయస్సు | ముఖ్యాంశాలు |
|---|---|---|
| 1. జనన పూర్వదశ | ఫలదీకరణం నుంచి పుట్టుక వరకు | — |
| 2. నవజాత శిశువు (Infancy) | పుట్టుక నుంచి రెండవ వారం చివరి వరకు | జనన పూర్వ పరిసరాలకు, జననానంతర పరిసరాలకు మధ్య ఏర్పడిన పరిస్థితులలో సర్దుబాట్లు చేసుకుంటుంది. |
| 3. శైశవదశ (Boy hood) | రెండవ వారం చివరి నుంచి రెండు సంవత్సరాల చివరి వరకు | పెరుగుదల అత్యంత వేగంగా జరుగుతుంది. జ్ఞానేంద్రియ వికాసం ఎక్కువ. ఏకాంత క్రీడా దశ. |
| 4. పూర్వ బాల్యదశ (Early childhood) | 2 నుంచి 6 సంవత్సరాల వరకు | ఇది అన్వేషించే వయస్సు. దీనినే పాఠశాల పూర్వదశ అంటారు. సాంఘిక వికాసానికి తొలి మెట్టు అయిన ఆత్మభావన ప్రారంభమయ్యేదశ. ఈ దశను ప్రమాద వయస్సు అని కూడా అంటారు. వాగుడు కాయ దశ అని, పూర్వముఠా దశ అని అంటారు. |
| 5. ఉత్తర బాల్యదశ (Late childhood) | 6 నుంచి 10 లేదా 12 సంవత్సరాల వరకు | ఇది పాఠశాల దశ. పెరుగుదల వేగం మందగిస్తుంది. సాంఘిక వికాసం ఎక్కువవుతుంది. వివిధ రకాలైన కౌశలాల వికాసం జరుగుతుంది. ఈ దశను ముఠా దశ అని పిలువబడుతుంది. |
| 6. యవ్వనారంభదశ (Puberty) | 10 లేదా 12 నుంచి 13 లేదా 14 సంవత్సరాల వరకు | ద్వితీయ లైంగిక లక్షణాలు అంకురిస్తాయి. |
| 7. కౌమారదశ (Adolescence) | 13 లేదా 14 నుంచి 18 సంవత్సరాల మధ్య | దీనినే ‘టీనేజ్’ (Teen age – Thirteen to Seventeen years మధ్య) అంటారు. భిన్న లైంగిక వర్గ వ్యక్తులను గురించి ఆలోచిస్తారు. ఇది వత్తిడి వయస్సు (Age of stress and strain). అస్థిరమైన దశ. |
| 8. పూర్వ వయోజనదశ (Early Adult hood) | 18 నుంచి 40 సంవత్సరాలు | సామర్థ్యాలు పరిపూర్ణత పొందుతాయి. శారీరక, మానసిక కాసం నిలిచిపోతుంది. |
| 9. మధ్య వయస్సు (Middle age) | 40 నుంచి 60 సంవత్సరాలు | ఇది సర్దుబాటు దశ. పునరుత్పాదక శక్తి తగ్గిపోతుంది. |
| 10. వృద్ధాప్యం (old age) | 60 నుంచి మరణం వరకు | నిష్క్రమణ వయస్సు. కొంతమంది వృద్ధుల్లో మెదడు పనిచేయడం నిలిచిపోయి సెనైలిటీ (Senility) కి దారి తీస్తుంది. |
2ఎరిక్సన్ మనోసాంఘిక దశలుErikson’s Psychosocial Stages
| దశ | వయోపరిమితి | మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు | గుణం / లక్షణం |
|---|---|---|---|
| 1. పూర్వ శైశవం (Infancy) | మొదటి సం॥ | నమ్మకం Vs అపనమ్మకం (Trust Vs mistrust) | ఆశ |
| 2. ఉత్తర శైశవం (Baby hood) | 1–3 సం॥ | స్వయం ప్రతిపత్తి Vs సిగ్గు, సంశయం (Autonomy Vs shame and doubt) | తలంపు |
| 3. క్రీడాదశ (Play age) | 3–5 సం॥ | చొరవ చూపడం Vs అపరాధ భావన (Initiative Vs guilty) | ప్రయోజనం |
| 4. పాఠశాల దశ (School age) | 6–12 సం॥ | శ్రమించడం Vs న్యూనత (Industry Vs inferiority) | సామర్థ్యం |
| 5. కౌమారం (Adolescence) | 12–20 సం॥ | పాత్ర గుర్తింపు Vs పాత్ర సందిగ్ధం (Role identity Vs role confusion) | విశ్వసనీయత |
| 6. పూర్వ వయోజన దశ (Young Adult hood) | 20–30 సం॥ | సన్నిహితం Vs ఏకాంతం (Intimacy Vs Isolation) | ప్రేమ |
| 7. మధ్య వయోజన దశ (Middle Adult hood) | 30–60 సం॥ | ఉత్పాదకత Vs స్తబ్ధత (Generativity Vs stagnation) | సంరక్షణ |
| 8. పరిపక్వ దశ (Maturity stage) | 60 పైన | సమర్థత / సమగ్రత Vs నిరాశ (Integrity Vs despair) | సూక్ష్మబుద్ధి |
Advertisement
APTET CDP · Related Study Material
- మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు & పారిభాషిక పదాలు — Psychology Pioneers & Terminology
- మనోవిజ్ఞాన శాస్త్ర సంప్రదాయాలు — Schools of Psychology
- విద్యా మనోవిజ్ఞాన పరిశోధన పద్ధతులు — Research Methods in Educational Psychology
- మూర్తిమత్వ సిద్ధాంతాలు & వర్గీకరణలు — Personality Theories & Classification
- మూర్తిమత్వ అంచనా విధానాలు — Personality Assessment Techniques
- రక్షక తంత్రాలు (Defense Mechanisms) — Defense Mechanisms in Psychology
- సంఘర్షణ రకాలు — Types of Conflict in Psychology
- ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణ & ప్రజ్ఞా పరీక్షలు — Intelligence Classification & IQ Tests
- అభ్యసన సిద్ధాంతాలు & అభ్యసన బదలాయింపు — Learning Theories & Transfer of Learning