TET Guru • Bilingual Study MaterialBack to Introduction to Psychology →
Schools of Psychology TETGURU
Structuralism, Functionalism, Behaviourism, Psychoanalysis, Gestalt మరియు Hormic theory — ఆరు ప్రధాన సంప్రదాయాల వివరణాత్మక అధ్యయనం, పూర్తి 12 సంప్రదాయాల జాబితాతో సహా.
మనోవిజ్ఞాన శాస్త్రంలోని ప్రధాన సంప్రదాయాలు (Schools of Psychology) వాటి మూలపురుషులు, ఇతర ప్రముఖులు మరియు ముఖ్యాంశాలతో సహా — APTET CDP పరీక్షకు అత్యంత ఉపయోగకరమైన అంశం.
Advertisement
1వివరణాత్మక అధ్యయనంDetailed Study — 6 Major Schools
| సంప్రదాయం | మూలపురుషుడు | ఇతర ప్రముఖులు | ముఖ్యాంశాలు |
|---|---|---|---|
| 1. సంరచనాత్మక వాదం (Structuralism) | ఉంట్ | టిష్నర్ | ఎ. చేతనానుభవాల (Consciousness) అధ్యయనం చేశారు. బి. అభ్యసనంలోని ప్రవర్తనాంశలైన సంవేదనలు, ప్రతిమలు, అనుభూతులు, ప్రత్యక్షం, సంసర్గం, స్మృతి, అవధానం, చింతనం అధ్యయనాంశాలు. సి. ‘అంతఃపరిశీలన’ వీరి అధ్యయన పద్ధతి. డి. దీనికే Content Psychology అని పేరు. |
| 2. కార్యకారణ వాదం (Functionalism) | విలియం జేమ్స్ | జాన్‌డ్యూయీ, జేమ్స్.ఆర్. ఏంజిల్, హర్వే ఎ.కార్, జి.హెచ్.మీడ్, థార్స్డైక్ | ఎ. సిద్ధాంతాలకే ప్రాధాన్యత నిచ్చిన పాఠ్య ప్రణాళికను ఆచరణాత్మక వైపు నడిపించింది. “Learning by doing” కి పాఠ్య ప్రణాళికలో అగ్రతాంబూలం ఇచ్చారు. బి. విద్యకు సంబంధించి-ఆచరణావాదాన్ని కాదని ఉపయోగితావాదానికి (Utilitarianism) పాముఖ్యతనిచ్చింది. సి. మనసు చేసే పనులు, లేక ‘మానసిక ప్రక్రియలు’ దీని అధ్యయనాంశం. డి. అంతఃపరిశీలన, పరిశీలన పద్ధతులు వీరి అధ్యయన పద్ధతులు. |
| 3. ప్రవర్తనావాదం (Behaviourism) | జె.బి.వాట్సన్ | హల్, టాల్మన్, గాధ్రే, స్కిన్నర్, పావ్లోవ్ | ఎ. అభ్యసనము, ప్రేరణ లాంటి మనోవిజ్ఞానశాస్త్ర అంశలో కొత్త భావనలను తీసుకువచ్చింది. బి. దీని కృషి వల్ల కార్యక్రమయుత అభ్యసనము (Programmed learning) వంటివి చేసుకున్నారు. సి. ఉద్దీపన (Stimulous-S), ప్రతిస్పందన (Response-R)ల ద్వారా మానవ, జంతు ప్రవర్తనను అధ్యయనం చేసింది. డి. వ్యక్తి అధ్యయన పద్ధతి (Case Study Method) కి ప్రాధాన్యతనిచ్చారు. ఇ. వ్యక్తి పరిసరాల వల్ల నేర్చుకుంటాడనేది వీరి వాదం. |
| 4. మనోవిశ్లేషణ సంప్రదాయం (Psycho Analysis) | సిగ్మండ్ ఫ్రాయిడ్ | ఆడ్లర్, యంగ్ | ఎ. వ్యక్తి ప్రవర్తన అంటే కేవలం బాహ్యప్రవర్తన మాత్రమే అనే భావనను తిరగరాశారు. మనిషి ప్రవర్తనలో బాహ్య ప్రవర్తన (చేతన) ప్రాధాన్యత అతిస్వల్పమని తెలిపింది. బి. మనిషి ప్రవర్తనలో చేతన, ఉపచేతన, అచేతన అనే మూడు విభాగాలుంటాయని, దీనిలో 90% ప్రవర్తన నిగూఢమైన అచేతనంలోనే దాగి ఉంటుందని తెలిపింది. సి. శిశువు తొలిదశలో (0-5 సం॥) ఆర్జించే అనుభవాలే మూర్తిమత్వం పై అధిక ప్రభావాన్ని చూపుతాయని తెలిపింది. డి. విద్యార్థులలో విషయాజనం (Maladjustment) నిపేర్కొంది. |
| 5. సమగ్రాకృతి వాదం (Gestalt theory) | వర్థిమర్ | కొహెలర్, కొఫ్కా, కర్ట్ లెవిన్ | ఎ. పరిస్థితిని విడివిడిగా విడగొట్టబడిన ముక్కలుగా కాకుండా, సమగ్రమైన మొత్తం (as a whole) చూడాలని తెలిపింది. బి. వీరి కృషివల్ల పాఠ్యాంశాలలో ఒకదానితో మరొకదానిని అన్వయించి బోధించడం (interdisciplinary approach) ప్రాముఖ్యత పొందింది. సి. విద్యార్థి ‘అంతర్‌దృష్టి’ ని పెంపొందించే కార్యక్రమాలను రూపొందించడం వీరి కృషి ఫలితమే. డి. వ్యక్తుల కంటే సమూహాలు ప్రాధాన్యత పొందాలని, బోధనలో లక్ష్యాలు (Goals), ఉద్దేశాలు (Purposes), ప్రాధాన్యత వహించాలనేది వీరి సిద్ధాంతం. ఇ. అంతర్‌దృష్టి, ప్రయోగ, పరిశీలన పద్ధతులని అనుసరించారు. |
| 6. ప్రయోజనతా వాదం (Hormic theory) | విలియం మెక్డౌగల్ | మాస్లో, కార్ల్రోజర్స్ | ఎ. మనిషిని సహజాతాలే వీరి అధ్యయనాంశాలు. ప్రతి ప్రవర్తన వెనుక ఒక ప్రయోజనం తప్పక దాగి ఉంటుందని తెలిపారు. బి. అంతః-ప్రేరణ వీరి అధ్యయన పద్ధతి. |
2త్వరిత పునశ్చరణ జాబితాQuick Revision List — 12 Schools
| క్ర.సం. | సంప్రదాయం | మూలపురుషుడు |
|---|---|---|
| 1 | సంరచనాత్మక వాదం | ఉంట్, టిష్నర్ |
| 2 | కార్యకరణ వాదం | విలియం జేమ్స్, జాన్‌డ్యూయీ |
| 3 | సంసర్గ వాదం | జాన్ లాక్ |
| 4 | ప్రవర్తనా వాదం | జె.బి. వాట్సన్ |
| 5 | గెస్టాల్ట్ మనోవిజ్ఞానశాస్త్రం | వర్థిమర్, కొఫ్కా, కొహెలర్ |
| 6 | మనోవిశ్లేషణ వాదం | సిగ్మండ్ ఫ్రాయిడ్ |
| 7 | వైయక్తిక మనోవిజ్ఞానశాస్త్రం | ఆడ్లర్ |
| 8 | విశ్లేషణాత్మక మనోవిజ్ఞానశాస్త్రం | యుంగ్ |
| 9 | ప్రయోజనతావాదం | హార్మిక్ |
| 10 | మనోవిజ్ఞాన శాస్త్రం | మెక్డౌగల్ |
| 11 | మానవతా వాదం | అబ్రహం మాస్లో |
| 12 | సంజ్ఞానాత్మక వాదం | పియాజె |
Advertisement
APTET CDP · Related Study Material
- మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు & పారిభాషిక పదాలు — Psychology Pioneers & Terminology
- వికాస దశలు — హావిఘర్స్ట్ & ఎరిక్సన్ — Developmental Stages — Havighurst & Erikson
- విద్యా మనోవిజ్ఞాన పరిశోధన పద్ధతులు — Research Methods in Educational Psychology
- మూర్తిమత్వ సిద్ధాంతాలు & వర్గీకరణలు — Personality Theories & Classification
- మూర్తిమత్వ అంచనా విధానాలు — Personality Assessment Techniques
- రక్షక తంత్రాలు (Defense Mechanisms) — Defense Mechanisms in Psychology
- సంఘర్షణ రకాలు — Types of Conflict in Psychology
- ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణ & ప్రజ్ఞా పరీక్షలు — Intelligence Classification & IQ Tests
- అభ్యసన సిద్ధాంతాలు & అభ్యసన బదలాయింపు — Learning Theories & Transfer of Learning