TET Guru • Bilingual Study MaterialBack to Introduction to Psychology →
Research Methods in Educational-Psychology -10 ప్రధాన పరిశోధన పద్ధతులు.
APTET / DSC CDP — Psychology
ఊహా పద్ధతి నుంచి ప్రయోగ పద్ధతి వరకు — 10 పరిశోధన పద్ధతులు, వాటి ఉపయోగాలు మరియు పరిమితులు ఒకే పట్టికలో.
విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉపయోగించే 10 ప్రధాన పరిశోధన పద్ధతులు — Anecdotal, Introspection, Naturalistic Observation, Case Study, Interview, Testing, Survey, Experimental Method — వాటి ఉపయోగాలు, పరిమితులతో సహా.
Advertisement
1పరిశోధన పద్ధతులు10 Research Methods — Uses & Limitations
| పద్ధతి | ఉపయోగం | పరిమితులు |
|---|---|---|
| 1. ఊహా పద్ధతి | ఇతర పద్ధతులేవీ అందుబాటులో లేనప్పుడు ఇది ఉపకరిస్తుంది. | పూర్తి ఊహ మీదనే ఆధారం / నిజపరిశీలన తక్కువ. నిర్ణయాలు సందిగ్ధం. నిరూపణలు ఉండవు. |
| 2. సంఘటన రచనా పద్ధతి (Anecdotal Method) | సరైన స్పష్టమైన వ్యక్తి మూర్తిమత్వాన్ని వివరిస్తుంది. మార్గదర్శకత్వం, నివారణా చర్చలు తీసుకోవడానికి ఉపయోగిస్తుంది. | సంఘటన రచనను నమోదు పరచడం, వ్యాఖ్యానించడంలో వ్యక్తి నిష్ఠత (Subjectivity) ఎక్కువ, విశ్వసనీయత తక్కువ. |
| 3. అంతఃపరిశీలన పద్ధతి (Introspection Method) | అంతర్గత అనుభవాలను అధ్యయనం చేయడానికి దీనికి మించిన పద్ధతి లేదు. | అంతర్గత అనుభవాలను నిరూపణ చేయడం కష్టం. పసిపిల్లలు, పిచ్చివాళ్ళు, మూగ, పశుపక్ష్యాదులపై ఉపయోగించలేము. భావ వ్యక్తీకరణకు భాష చాలకపోవచ్చు. |
| 4. సహజ పరిశీలన (Naturalistic observation) | సహజ పరిస్థితులలో ఏర్పడే ప్రవర్తనను గమనించడానికి పరిశోధన దశలో ఉపయోగపడుతుంది. | పరిస్థితులు పరిశోధకుడి అదుపులో ఉండవు. వ్యక్తి నిష్ఠత వల్ల పరిశీలనలో పొరపాట్లు రావచ్చు. అనవసర విషయాల జోక్యం ఉంటుంది. ప్రవర్తనకు కారణాలు చెప్పడం కష్టం. |
| 5. వ్యక్తివిచిత్ర అధ్యయనపద్ధతి (Case study / Case history Method) | ఒక వ్యక్తి అధ్యయనానికి ఇది చాలా అనువైన పద్ధతి. వ్యక్తిని చాలా లోతుగా, సమగ్రంగా పరిశీలించవచ్చు. పరిశోధకులకు పరికల్పనలు చేసుకోవడానికి ఉపకరిస్తుంది. | ఎక్కువ సమయం పడుతుంది. వ్యక్తి నిష్ఠత ఎక్కువ. సేకరించిన విషయాలతో విశ్లేషణాపూర్వకంగా వివరించడం కష్టం. |
| 6. క్రమాభివృద్ధి పత్రం (Cumulative Record) | వ్యక్తిలో జరిగిన మార్పులు క్రమంగా ఉన్నాయో, లేదా తెలుసుకోవడానికి, విద్యా విషయాల్లో మార్గదర్శకత్వం ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. | ఎక్కువ సమయం తీసుకుంటుంది. వ్యక్తి నిష్ఠత ఎక్కువ. విశ్లేషణాపూర్వకంగా వివరించడం కష్టం. |
| 7. పరిపుచ్ఛ పద్ధతి (Interview Method) | వ్యక్తికి, వ్యక్తికి మధ్య సామరస్యం ఏర్పరచవచ్చు. విషయ సేకరణ సులభం. వ్యక్తి పోవ భావాలను పరిశీలించవచ్చు. | విశ్లేషణ పూర్వకంగా వివరించడం కష్టం. శిక్షణ లేకపోతే పరిపుచ్ఛకుడు సరిగా విషయ సేకరణ చేయలేడు. |
| 8. పరీక్షా పద్ధతి (Testing Method) | వ్యక్తిగత లక్షణాలు, అభిరుచులు, ప్రజ్ఞ, వైఖరులు మొదలైన వాటిని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. | సప్రమాణత (Reliability), విశ్వసనీయత (Validity) గల పరీక్షలు దొరకడం, తయారు చేయడం కష్టం. |
| 9. సర్వే పద్ధతి (Survey Method) | ఎక్కువ మంది నుంచి చాలా ఎక్కువ సమాచారాన్ని తక్కువ కాలంలో పొందవచ్చు. | వ్యక్తుల ప్రతిస్పందనలు నిజాయితీగా ఉండకపోవచ్చు. ప్రయోజ్యులు సరైన ప్రతిస్పందన ఇవ్వకపోవచ్చు. |
| 10. ప్రయోగ పద్ధతి (Experimental Method) | ప్రయోగ పరిస్థితులపై పూర్తి నియంత్రణ ఉంటుంది. కార్యకారణ సంబంధాలను (Cause and effect relationships) సులభంగా గుర్తించవచ్చు. | కల్పిత పరిస్థితుల వల్ల ఫలితాలు సాధారణీకరించడం కష్టం. పరిశోధకుని అంతర్ చర్యలు ఫలితాలను మారుస్తాయి. బాహ్య చరాల ప్రభావాన్ని అదుపులో పెట్టడం కష్టం. కచ్చితమైన సన్నివేశాలను ఏర్పరచడం కష్టం. వైయక్తిక భేదాల వల్ల ప్రతిస్పందనలు భిన్నంగా రావచ్చు. |
Advertisement
APTET CDP · Related Study Material
- మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు & పారిభాషిక పదాలు — Psychology Pioneers & Terminology
- మనోవిజ్ఞాన శాస్త్ర సంప్రదాయాలు — Schools of Psychology
- వికాస దశలు — హావిఘర్స్ట్ & ఎరిక్సన్ — Developmental Stages — Havighurst & Erikson
- మూర్తిమత్వ సిద్ధాంతాలు & వర్గీకరణలు — Personality Theories & Classification
- మూర్తిమత్వ అంచనా విధానాలు — Personality Assessment Techniques
- రక్షక తంత్రాలు (Defense Mechanisms) — Defense Mechanisms in Psychology
- సంఘర్షణ రకాలు — Types of Conflict in Psychology
- ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణ & ప్రజ్ఞా పరీక్షలు — Intelligence Classification & IQ Tests
- అభ్యసన సిద్ధాంతాలు & అభ్యసన బదలాయింపు — Learning Theories & Transfer of Learning